![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -95 లో.... గోడపై కార్తీక్ పేరుని శౌర్య రాయగా.. దానిని దీప చేరిపేస్తుంటే శౌర్య వస్తుంది. అమ్మ వద్దు ఎలాగు కార్తీక్ నా దగ్గర లేడు కదా.. ఇలా అయినా ఉంటే నా పక్కనున్నాడని అకుంటానని శౌర్య అంటుంది. ఇలా గోడలపై పేర్లు రాస్తే ఓనర్ తిడుతాడని దీప చేరిపేస్తుంది. అప్పుడే కార్తీక్ పేరుని శౌర్య చేతిపై రాసుకొని వస్తుంది. అలా గొడపై రాస్తే తిడుతాడు కానీ చేతిపై రాస్తే ఏం అనడు కదా అని శౌర్య అంటుంది.
అప్పుడే ఇంటి ఓనర్ వచ్చి.. రేపు గుడిలో ప్రసాదం చెయ్యాలి చేస్తావా అని దీపని అడుగుతాడు. దానికి దీప సరే అంటుంది. మరొకవైపు సుమిత్ర ఇంటికి కార్తిక్ వస్తాడు. హాల్లో పారిజాతం శివన్నారాయణ ఉంటారు. ఇంట్లో ఎవరు లేరా అని కార్తీక్ అడుగుతాడు. నీకు, జ్యోత్స్న కి ఎంగేజ్ మెంట్ కి ముహూర్తం కాయం చెయ్యడానికి గుడికి వెళ్లారనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఎందుకు నీకు నాకు ఇష్టం లేకున్నా దగ్గర ఉండి ఇదంతా చేస్తున్నావని పారిజాతాన్ని కార్తిక్ కోప్పడతాడు. నువ్వు నా మనవరలిని పెళ్లి చేసుకోవాలని పారిజాతం అంటుంది. నాకు ఇష్టం లేదని ఇప్పుడే వెళ్లి మావయ్య వాళ్ళకి చెప్తానని కార్తీక్ అనగానే.. మీ అమ్మ జ్యోత్స్నని ఇంటికి కోడలు చేసుకోవాలని ఆశతో ఉందంటూ పారిజాతం అంటుంది. మరొకవైపు శౌర్యని తీసుకొని దీప గుడికి ఆటోలో వెళ్తుంటుంది. అప్పుడే రోడ్డు పక్కన తండ్రి కూతుళ్లు వెళ్తుంటే.. కూతురికి దెబ్బ తగిలితే తండ్రి ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటాడు. శౌర్య అలాగే చూస్తుంటుంది. కొంపదీసి ఇప్పుడు శౌర్య వాళ్ళ నాన్న గురించి అడుగుతుందా అని దీప భయపడుతుంది. కానీ కార్తీక్ గురించి అడుగుతుంది. ఇదేంటి నర్సింహ గురించి అడగకుండా.. కార్తీక్ గురించి అడుగుతుంది. హాస్పిటల్ లో బాబు అన్నా మాటలు విందా అని దీప అనుకుంటుంది. మరొకవైపు సుమిత్ర దశరత్ ఇంకా కాంచన శ్రీధర్ లు గుడిలో పంతులు గారితో మాట్లాడుతుంటారు. జ్యోత్స్న, కార్తీక్ ల ఎంగేజ్ మెంట్ కి ముహూర్తం అడుగగా వచ్చే వారం ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు.
దీప, శౌర్యలు గుడికి వెళ్తారు. అక్కడ సుమిత్ర ప్రసాదం పెడుతుంటే.. దీప, శౌర్య ఇద్దరు చూస్తారు. శౌర్యని ఒక దగ్గర కూర్చొపెట్టి.. సుమిత్ర చూడకూడదని దీప పక్కకు వెళ్తుంది. అయిన సుమిత్ర చూసి.. దీప దగ్గరకి వస్తుంది. ఎందుకు చెప్పకుండా వెళ్ళావని సుమిత్ర అడుగగా.. చెప్తే మీరు వెళ్ళనివ్వరని చెప్పలేదని దీప అంటుంది. సరే నువ్వు ఇప్పుడు రావాలి.. జ్యోత్స్న, కార్తీక్ ల ఎంగేజ్ మెంట్ కి ముహూర్తం పెట్టడానికి వచ్చాము. నువ్వు లేకపోతే నాకు వెలితిగా ఉంటుందని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |